Friday, December 31, 2010

ప్రేమా... దోమ...

నేను పోడుర్ లో polytechnic రెండో సవత్సరం చదువుతున్నాను. ఈ రోజు నుంచి మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవుతున్నై. అందుకే నేను తొందరిగా నిద్రలేచి కాసేపు రికార్డు బుక్ తిరగేసాను. తరువాత రెడీ అయ్యి కాలేజీకి బయలదేరాను. నీను రోజు పాలకొల్లు నుంచి పోడుర్ బస్సు లో వేల్లివస్తాను. అందుకే బస్సు మిస్ అవ్వకుదని తొందరిగా నా బస్సు స్టాప్ కి వెళ్ళాను. కొంత సమయానికి పోడుర్ వెళ్ళే గ్రామిని బస్సు వచ్చింది. నేను బస్సు ఎక్కి మా కాలేజీ ఫ్రెండ్స్ తో మాటలాడుతూ, ఎక్షమ్ గురుంచి దిస్చుస్స్ చేసుకుంటూ ఉన్నాము, అంతలో మా కాలేజీ స్టాప్ వచేసింది. మేము అందరం కాలేజీలోకి వెళ్లి మా మా క్లాసు రూమ్స్ లోకి వెళ్లి ఎక్షమ్ కోసం ప్రేపరే అవుతున్నాము.

ఎక్షమ్ అయిపోయాక నేను మా క్లాసులోకి వెళ్లి నా స్నేహితుడైన సూరి (సురేంద్ర) కోసం ఎదురు చూస్తున్నాను. కాసేపటికి వాడు వచ్చాడు, “ఎక్షమ్ ఎలా ఉందిరా” అని నేను అడిగాను వాడిని. “నాకు వచ్చిన ఎక్ష్పెర్మెన్త్ కొంచం టైం తీసుకుందిరా” అన్నాడు సూరి. ఇంతలో మా క్లాసు కి ముచ్చటగా ఉన్నన ముగ్గురు అమ్మాయులు (ఉమా మహేశ్వరీ, శైలజ, శ్రీలక్ష్మి) క్లాసు లోకి వచారు. శ్రీలక్ష్మి బ్లాకు అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న చుడిదార్ లో చాల అందంగా ఉంది, తనను ఈ రోజు బస్సు లో చూడలేదు, ఇదే చూడటం. తను నర్సాపూర్ నుంచి పలకోలు మీదగా పోడుర్ వస్తుంది. అసల్కి నేను కాలేజీకి వచ్చిన రోజే తనని చూసి ఫ్లాట్ అయ్యిపోయా, ఈ విషయం సురిగాడికి మొదటి సవత్సరం చివరిలో చెప్పను. వాడు నన్ను వెళ్లి శ్రీలక్ష్మి తో మాటలడమన్నాడు, వేల్దమనేలోపే మా క్లాసు మేట్స్ ఒకరి తరువాత ఒకరు వచేసారు L. “మంచి ఛాన్స్ మిస్ చేసావు కదా రా... ఇలాగైతే నీ మనసులో మాట నా చెల్లెకి ఎలా చేపుతావు బావా” అని అన్నాడు సూరి. “ప్రస్తుతానికి ఆ టాపిక్ మార్చారా బబూ, ఎవరైనా వింటే నా పని అంతే...” అని అన్నాను.

నేను, సూరి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడీ నాకు ఒక ఐడియా వచ్చింది. వేంటనే “ఒరేయ్ సూరి, నువ్వు రేపు ఎక్షమ్ అయిపోయాక నాతొ నర్సాపూర్ కి వస్తావా?” అని అడిగాను. “నర్సాపూర్ కి ఎందుకు రా?” అన్నాడు వాడు. “నువ్వు నన్ను తిట్టనంటే చెప్తా” అన్నాను. “ఛా, నీకు నేనంటే ఏదో బయమున్నాటు... చేసిన ఓవర ఆక్షన్ ఆపి విషయం ఏమిటో చెప్పు” అన్నడు వాడు. దానికి నేను సిగ్గు పడుతూ పక్కనే ఉన్న చెట్టు కొమ్మని పాతుకుని దానిని కిందకి పైకి లాగుతూ “అదేరా, శ్రీలక్ష్మి ఉంటుంది నరాపూర్ లో కదా... తన ఊరు, తన ఇల్లు...” ఇంకా నేను చేపే లోగా“అనుకున్నాను రా ఇలాటిది ఏదో అంటావని... ఎదురుగా ఉన్నపుడే మాటలడవు... నీ #$%$&...” అని తిట్ల వర్షం మొదలపెట్టాడు. దానికి నేను “అంతే రా... అంతేలే నువ్వు కూడా.....” “వద్దు రా ఆపు... నీ వేషాలు నువ్వు... ఆ తోలి ప్రేమ సినిమా చూసినప్పటి నుంచీ చూస్తున్నాను... నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ లాగా ఫీల్ అవుతున్నావు... నువ్వు శీను గాడివిరా హీరోవి కాదు. ఈ నరాపూర్ ప్లాన్ పక్కన పెట్టి ముందు ఎగ్జామ్స్ గురించి ఆలోచించు... వచ్చే వరం నుంచే మన ఫైనల్ ఎగ్జామ్స్.” అని బుడగలో గాలి తీసినట్టు నా ఆలోచనని గాలిలో కలిపెసాడు వాడు...

------------------------------------------------------------------------

Take Care...

Bye... Have A Great Day...