Tuesday, January 18, 2011

ఎవరో... తానెవరో... ఆ నవమోహిని ఎవరో...


“వచ్చి ముప్పావుగంట అవుతుంది... ఇంకా ఎంతసేపు నీకోసం వేచి చూడాలి? ఎప్పుడు వస్తావే నువ్వు? ఎంత సేపు... ఇలా అయతే నా వల్ల కాదు...” 

ఏంటి గర్ల్ ఫ్రెండ్ కోసం అనుకుంటున్నరా... కాదండి, మన హైదరాబాద్ యం.యం.టి.యస్. రైలు కోసం ఈ తిప్పలు... 

ఏంటి.. బైక్ ఉండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఈ బాదలు ఎందుకు? రైలు కోసం ఈ తిప్పలు ఎందుకు అంటారా... భలే వారే ఏమి తెలియనట్టు, మీరు మరీను... మన ప్రభుత్వం డిసెంబర్ లో ఇచ్చిన కానుక సరిపోనట్టు ఈ సంక్రాంతికి ఇచ్చిన కానుక (పెట్రోలు దార పెంపుదల) గురించి తెలిసి ఇలా అడగటం ఏమి బాగోలేదండి? అదీగాక నా మేనేజర్ నాకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు, క్లైంట్ ప్లేస్ లో పని చెయ్యాలి, అది తార్నాకలో ఉంది. మరి అంత దూరం ఈ pollutionని, పెట్రోల్ని నేను కాదు కదా ఆ దేవుడుకుడా బరించలేడు... అందుకే ఈ రైల ప్రయాణం... 


క్షణ క్షణానికి ప్లాట్ఫారంపై జనం పెరుగుతున్నారు. అంతలో “లింగంపల్లి - ఫలక్నామా” రైలు వచ్చింది. అది ఈ నేచర్ క్యూర్ స్టేషన్లో ఒక్క నిమిషమే ఆగుతుంది. ప్రతి ఒక్కరి కాళ్ళలోనూ రైలు ఎక్కాలని తొందరపాటు స్పష్టంగా కనిపిస్తుంది. రైలు ఎక్కిన తరువాత కూర్చోవటానికి సీటు, లేదా నున్చోవటానికి స్థానం కోసం వాళ్ళ కళ్ళు వెదుకుతున్నయి. నేను కూడా రైలు ఎక్కాను, ఎక్కడా కూర్చోవడానికి కాలి లేకపోవడంతో నేను కొంచం లోపలకి వెళ్లి పైన ఉన్న రోడ్ని పట్టుకొని నించున్నాను. నుంచుని ప్రయాణం చెయ్యడం చాలా చిరాకుగా ఉంటుంది, అదీగాక అలా అరగంట ప్రయాణం చెయ్యాలి అంటే మరీను. ఇంతలో రైలు కదిలింది. అలాగే ముందుకు సాగుతూ మా రైలు “బేగంపేట”, “సంజీవయ్య పార్క్” స్టేషన్లను దాటుకుంటూ “జేమ్స్ స్ట్రీట్” స్టేషన్లో ఆగింది. ఇక్కడ కొంతమంది రైలు దిగుతున్నారు. అప్పుడే ఒకే మిత్ర బృందం సీట్ లోంచి లేచి రైలు దిగడం నేను గమనించా, వేంటనే ఆ సీటు వైపు పరిగెత్తి సీట్లో కూర్చున్నా. పక్కనే ఉన్నా వాళ్ళు నన్ను విచిత్రంగా, కోపంగా చూసారు. వాళ్ళకేమి తెలుసు నా బాధ... నుంచుని నుంచుని నా కాళ్ళు పీకేస్తున్నాయి... అవేమి పట్టించుకోకుండా నేను హయిగా కిటికీ పైన తల పెట్టి కాసేపు కళ్ళు మూసుకున్నాను.

కాస్త అలసట తిరుందేమో, నా చుట్టూ ఉన్నవాలని గమనిస్తున్నాను. కాలేజీ కుర్రాళ్ళు, ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు.. ఇలా చాలా మంది రకరకాల డ్రెస్సులు వేసుకుని ఉన్నారు... కొందరు దినపత్రిక చదువుతున్నారు, మరికొందరు సినిమాలు, రాజకీయాలు... వాగేర వాగేర గురించి చర్చించుకుంటున్నారు. ఇంకొంతమంది ఎటో చూస్తూ ఏవేవో ఆలోచిస్తున్నారు, వాళ్ళ కళ్ళు స్పష్టంగా చెబుతున్నాయి... “ఈరోజు ఎదురయ్యే పని వత్తిడిని ఎలా ఎదురుకోవాలి?, పనిని ఎంత తొందరిగా పుర్తిచేయ్యాలి?” అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాకు ఎప్పుడూ చిత్రంగా అనుపిస్తూ ఉంటుంది - ప్రతి మనిషి తన జీవితం ఎలా సాగించాలో ఆలోచించకుండా... ఆఫీసు, ఆఫీసులో పని అని ప్రతి నిమిషం దాని గురించే ఆలోచిస్తూ ఎందుకు ఉంటారో అని. 

సర్లే వీల్లగురించి మనకెందుకులే అనుకుని వెన్నకి వాలి కళ్ళు ముసుకుందాం అనుకునేసరికి నేను ఒకటి మరచిపోయనని తెలిసివచ్చింది, చుట్టుపక్కల అందరిని గమనించిన నేను నా ఎదురుగా ఉన్న ఆ అపురూపమైన దృశ్యాని ఏల విస్మరించితిని... హతవిధి... అనుకొని నేను పక్కవాళ్ళ జీవితాల్లోంచి బయటకి వచ్చి నా కళ్ళని కొంచం పెద్దవిగా చేసుకొని నా ఎదురుగా సీట్లో కుర్చుని ఉన్న ఓ అందమైన సుందరాంగిని చూడసాగాను. రంభ, ఊర్వసి తలదన్నే రామనీలలామె ఎవరీమ?... నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యకరసియే కాబోలు... అనుకుంటూ ఆమనే చూస్తున్న నేను మరుక్షణం కిటికీ బయటకి చూడసాగాను. ఆమె నన్ను తనని చూడటం గమనించిందా? ఎందుకిలాంటి చిన్న చిన్న విషయాలపై నన్ను ప్రస్నిస్తూ ఉంటుంది నా మనసు? ఏమైంది... ఏమైంది... నా మాట ఆగిందా?... నా మౌనంలో తడబాటే దాగుందా?... కిటికిలోంచి బయటకి చూస్తున్నాను కాని నాకు ఏమి కనిపించడంలేదు. ఆ అందాల బొమ్మని కాకా వేరోకదనిని చూడటానికి నా హృదయం ఒప్పుకోవటలేదు. ఆ ఆలోచనలనుంచి బయటకి వచ్చాకే తెలిసింది నాకు, నా కళ్ళు ఆమనే చూస్తున్నాయని. మళ్ళి అదే జరిగింది. ఆమె కళ్ళు నావైపు... నా కళ్ళు కితికివైపు... ఇలా కొంతసేపు మా కళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నాయి. 

లేదు ఇలాకాదని నాకు నేనే ద్యర్యం చెప్పుకుని ఆమె చూసినా నేను తల తిప్పకుడదని నిర్ణయానికి వచ్చాను. మళ్ళి ఆమను చూస్తూనే ఉన్న. ఆమె మళ్ళి నావైపుకు తిరిగి చూసింది, ఈసారి నేను నిర్ణయించుకున్నట్టుగానే తల తిప్పలేదు, దానికి ఆమెకు షాక్ తగిలినంత పని జరిగింది. కొంచం కూపము, కొంచ్చం సిగ్గు, కొంచం బిడియం అన్ని ఆమె మొహములో స్పష్టంగా కనిపించాయి నాకు. కొద్దిసేపటికి ఆమె కూడా నన్ను చూడసాగింది, ఇప్పుడు చిన్నగా చిరునవ్వుతో. “భాయ్ లడకీ హాసి తో ఫాసి...” అన్న హిందీ డయలాగ్ నాకు గుర్తుకువచ్చింది, ఇంక నా ఆనందానికి హద్దులు లేవు. ఇది కలా? నిజామా?అని నా మనసు ప్రశ్నించింది. “నువ్వు ఎంత కాద్నన్న ఇది నిజాము” అని నేను దానికి సమాధానం ఇచ్చా. అలా మేమిద్దరం కాసేపు కళ్ళతోనే మాట్లాడుకుంటూ సమయం గడిపీస్తూ ఉన్నాం. నేనైతే మనసులో “అంతగా నను చూడకు... వింతగా గురి చూడకు... వేటాడకు... “ అంటూ ఘంటసాలగారి పాట పాదేసుకుంటూ ఉన్న... ఇంతలో “సీతాఫల్మండి స్టేషన్” అని నాకు వినిపించింది, అది నేను దిగవలసిన స్టేషన్, వేంటనే నా కలల లోకంలోంచి బయటకి రావాల్సి వచ్చింది. నేను నిలబడి ఆమెను చూస్తూ మెల్లగా రైలులో నుంచి బయటకు దిగుతున్నాను. ఆమె ముఖములో ఏదో తెలియని భాద కనిపించింది. నేను రైలు దిగి అక్కడే నుల్చుని కిటికీలోంచి ఆమెను చూస్తూనే ఉన్నాను. మెల్లగా రైలు కదలసాగింది, ఆమె నా కళ్ళలోకి చూస్తూ వీడ్కోలు చెప్పింది. 

కొంతసేపటి వరకు నేను ఆ తెలియని మాయలోనే ఉండిపోయాను, రైలు నానుంచి అల అలా దూరంగా వేల్లిపోతుఉంది. ప్రతీరోజులా నా కాళ్ళు ఆఫీసుకు పరుగు తీయలేదు, వాటికీ ఈరోజు అలా చేయడం ఇష్టంలేదు. ఆమె నాకోసం వస్తుంది అనిపించి అలాగే అక్కడే చాలాసేపు వేచి చూసాను. నాకు అక్కడే నిరీక్షిస్తూ ఉండిపోవాలని ఉండి, కాని నేను మనిషినేగా... ఆఫీసు... పని... గుర్తుకువచ్చి మెల్లగానే అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడినుంచి ఆఫీసు వైపు ప్రయాణం సాగించా. 

ఆఫీసులోకి వెళ్ళాను గనీ... చాలా ప్రశ్నలు నా మనసుని ప్రతీ క్షణం అడుగుతూనే ఉన్నాను.... 

నేను ఎందుకు ఆమెను మరచిపోలేకపోతున్నాను? 

మా ఇద్దరి మధ్య ఏమి జరిగింది? 

ఆమె పేరు ఏమిటో? ఆమె గొంతు ఎలా ఉంటుందో? 

అన్నిటికంటే ముఖ్యమైనది... “ఎవరో... ఆమెవరో... ఆనవమోహిని ఎవరో...”

----------------
Thank you,
Yours...
Srini :)


Tuesday, January 4, 2011

ఆటాడుకుందాం రా...


రెండు నెలల ముందు...

ఆరు సంవత్సరాలు గా ఈ జాబు చేసి... చేసి.. చిరాకుగా ఉంది నాకు... ఎంత కాలం ఇలా అని కొంత కాలంగా అనిపిస్తూ ఉంది. మొదట్లో Software Engineer, తరువాత Software Consultant దాని తరువాత Sr.Software Consultant... Team Lead... ప్రాజెక్ట్ లీడ్... ఇలా పేరులు ఏమైనా చేసేది ఇంచుమించు ఒకటే కదా పని.... ఇంకా ఎన్ని రోజులు ఇలా...

ఇలాంటి సందర్భంలో... మా ప్రాజెక్ట్ మేనేజర్ నన్ను ప్రాజెక్ట్ లీడ్ చేసి, క్లైంట్ ప్లేస్ లో పని చెయ్యమన్నాడు. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్... తెలుసుగా మన గవర్నమెంట్ ఆఫీసు, ఆ స్టాఫ్.. గురించి...(గవర్నమెంట్ ఆఫీసు విషయాలు తరువాత ఎప్పుడైనా చేపుతలే...) అలంటి ప్రాజెక్ట్ నాకు అప్పగించి వాడేమో హైటెక్ సిటీ ఆఫీసులో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు... ఏమైనా క్లైంట్ తో ఇబ్బందులున్నాయి అని చెప్పినా వినడు, పట్టించుకోడు... ఏదో అలాగే పది నెలలు నేట్టుకోచా... నాలో జాబు మీద విరక్తి పెరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలో మార్చ్ వచ్చింది.. జీతం పెంచి, ప్రొమోషన్ వస్తుందనుకున్న నాకు పెద్ద షాక్... హైటెక్ సిటీ ఆఫీసులో రాజకియాలు నడిపారు... నేను సరిగ్గా పని చేయ్యలేదంట్ట, క్లైంట్ ప్లేస్ అని చెప్పి శేకార్లు కొట్టానంట... జీతం పెరగకపోయినా, ప్రొమోషన్ రాకపోయినా నేను బాధపడలేదు... కాని నేను... అంత కష్ట పడ్డ నేను పని ఏమి చెయ్యలేదు అని రిపోర్ట్ చూసినతరువాత కూడా అక్కడ పని చేయ్యలనిపించలేదు... వేంటనే రాజీనామా ఇచ్చీ బయటకి వచ్చేసా.

తరువాత నాకు టైం ఎక్కువ దొరకంతంతో చింటూ, రమేష్ లతోనే టైం స్పెండ్ చేసేవాడిని...

*********

ప్రస్తుతం...

చింటూ సొంతంగా ఒక ఎడిటింగ్ స్టూడియో ఉంది. చింటూ వాళ్ళ మేనమామగారు తెలుగు సినిమా నిర్మాత. ఆయననే ఆదర్శంగా తీసుకుని వాడు కూడా సొంతంగా ఏమైనా చేయాలనుకుతుండదు. రమేష్ నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్... వాడు కూడా జాబు కాకుండా ఏమైన చెయ్యాలనుకుంటూ ఉంటాడు. మేము ముగ్గురం శనివారంనాడు చింటూ వాళ్ళ ఇంట్లో కలుసుకున్నాము. ఏమి చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తున్నాము... ఇంతలో.. కిరణ్ (నా రూమ్మేట్.. ఫ్రెండ్ కుడా...) ఫోన్ చేసి హర్రీ పోట్టర్ 7 సినిమాకి టిక్కెట్లు తీసాను... ఆరున్నరకి ఐ-మాక్స్ లో షో అన్నాడు... నేను వాడిని మూడున్నరకి ప్రసాద్స్ కి రమ్మన్నాను.

*********

Time : 3.30 PM
స్థలము : ప్రసాద్స్

నలుగురము Mc Donaldలో కలుసుకోన్నాము. జాబు చెయ్యకుండా మా స్వశక్తితో డబ్బులు సంపాదించే మార్గాల గురించి చర్చ మదలైది. సినిమాలు తీదామా? సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేదామా? ఏమి చేయాలి???
సినిమాలు తీయాలంటే ముందుగా మన దగ్గిర డబ్బులు ఉండాలిగా... పోనీ అప్పో సప్పూ చీసి తీడమంటే... అది అంత తేలికయినది కాదుగా... ఏమిచేయాలో అల్లోచిస్తుంటే నాకు ఫోన్ వచ్చిది, ఇంటినుంచి... నేను అలా బయటకి వెళ్లి అమ్మతో మాటలడ్తుంటే అక్కడ జనం కనిపించరు నాకు... (అది ప్రసాద్స్ లో మామూలే... ఏదో కంపెనీ వాలు వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోషన్ కోసం ఏవో ఆటలో, పాటల పెడుతుంటారు...) వేంటనే ఒక ఐడియా (జీవితాని మార్చేసేదే... :)) వచ్చింది. దాంతో.. “అమ్మ నేను సినిమాకి వెళ్లి పదింటికల్లా ఇంటికి వస్తాను” అని చెప్పి ఫోన్ కట్ చేసి, మా వాళ్ళా దగ్గరకి వెళ్ళి “ఒరేయ్... నాకు మంచి ఐడియా వచ్చింది...” అని మోదలుపేటా...

“మనం రోజు టీవిలో ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాము కదరా..”... ఇంతలో రమేష్ గాడు... “నా రూములో టీవీ లేదురా!!!” అంటూ క్యూస్షన్ మార్క్ ఫస్ పెట్టాడు... “బాబు నన్ను చెప్పనీ రా...” అంటూ నేను వాడి నోట్లో బుర్గేర్ కుక్కేసాను...

“వాడి సంగతి తెలుసు కదా... వాడిని వదిలి విషయం చెప్పు” అన్నాడు చింటూ.

“సరే.. నరే..” అంటూ నేను మొదలపెట్టా... “టీవిలో రోజు ఆటకు, పాటలు అంటూ ఏవేవో ప్రోగ్రామ్స్ వస్తు ఉంటాయిగా... అలాగే, మనం కూడా ఒక్క గేమ్ షో స్టార్ట్ చేదాం... అది అందరికంటే బిన్నంగా ఉంటుంది” అని చెప్పి... గేమ్ షో, అది ఎలా ఉంటుంది... దానిని ఎలా ప్రెసెంట్ చెయ్యాలి... అన్ని చెప్పా...

“ఐడియా బాగానే ఉంది... దినిగురుంచి ఇంకా మనం రేసేఅర్చ్ చెయ్యాలి” అన్నాడు కిరణ్.... “దాని గురించి నువ్వు మరచిపో... చింటూ ఉన్నాడుగా” అన్నాను నేను... “ఆ.. దాని గురుంచి కావలిసిన సమాచారం నేను రేపు సాయంత్రం కాళ్ళ తెసుకోస్తా...” అన్నాడు చింటూ...

“ఒరేయ్ 6.20 అయ్యిందిరా.... సినిమా స్టార్ట్ అవుతాది ఇంకో పది నిమిషాల్లో...” అన్నాడు రమేష్. అందరం సినిమా హల్ల్లోకి వెళ్ళాం...”

ముడు గంటలు తరువాతా....
సరే మరి... రేపు సాయంత్రం నలుగు గంటలకి చింటూ వాళ్ళా ఆఫీసు లో కలుదాం అని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను.

ఇంటికి వచ్చి భిజనం చేసి... సరాసరి నా మంచంపై వాలిపోయాను... ఎప్పుడు పట్టిందో తెలీదు... గంగని చంద్రముఖి పట్టినటు... నాకు నిద్ర పట్టింది... (ఈ పోలిక ఎందుకు? అనుకుంటున్నారా... ఎందుకంటే మనకి రాత్రి ఒంటిగంట దాటాల్సిందే నిద్ర పూవాలంటే... అందుకు...)

*********



“ఒరేయ్ చింటూ... సెట్ట బాగుందిరా.. సూపర్.. థాంక్స్ ర బాబు.. ఎలా చేస్తామో ఏంటో అనుకున్నా... అన్ని బాగానే ఉన్నాయి... ఇంకో పావుగంటలో మన గేమ్ షో మొదలవుతుంది... నాకు చాల సంతోషంగా ఉందిరా...” అన్నాను.

“నువ్వు లేకపోతే ఇదంతా ఇంత తోదరిగా జరిగేది కాదురా.. ETVలో మన షో... నాకు చాల ఆనందంగా ఉంది... అలాగే భయంగా కూడా ఉందిరా...” అన్నాను చింటూ తో...

“భయమా.. ఎందుకు” అని అడిగాడు...

“ఈ షో కి నువ్వే డైరెక్టర్ అని నేను అంటే.. సరే అని,  ప్రేసేన్టర్ గా నన్నే చెయ్యమని అన్నావుగా... అందుకే... ఎలా ఉంటుందోనని చాల భయపడి చస్తున్నాను... చూడు... నా కాళ్ళు ఎలా వణికిపోతున్నయో...” అన్నాను...

“మరేమి పరవాలేదు... నిన్న మనం రిహార్సల్స్ చేసాము కదా.. నువ్వు బాగానే చేసావురా... భావపడకు... టైం అవుతుంది... వెళ్ళు.. స్టేజిపైకి... అల్ ది బెస్ట్...” అని వాడు నన్ను స్టేజిమీదకి తోసాడు.

“ఒకే... సైలెన్స్... లైట్స్ ఆఫ్... స్పోట్లిఘ్ట్ శ్రీను మీద పడాలి... కామెర రోలింగ్... శ్రీను... రెడీ... ఆక్షన్...” అన్నాడు చింటూ...

“'ఆటాడుకుందాం రా'కి స్వాగతం, సుస్వాగతం... ఇది మీరు ఎప్పుడు చూడని సరికొత్త గేమ్ షో... ఆట మొదలుపెడదామా... ”

*********

“ఇంకేంతసేపు పోడుకుంటావు.... లేరా పెద్దోడా... టైం పది అవుతుందిరా... డాడీ తో సంతకి వేల్లలిగా... లెగు...” అంటూ కేకలేసింది అమ్మ...

“నువ్వు నా గేమ్ షో కి ఎప్పుడు వచ్చావు అమ్మా...” అని నేను అన్నాను

“గేమ్ లేదు ఏమి లేదు.. ముందు లేచి సంతకి వెళ్ళు డాడీ తో...” అంది అమ్మ...

దెబ్బకి లేచి కుర్చున్న్...

ఏంటీ!!! ఇదంతా నా కలా...:(