Tuesday, January 4, 2011

ఆటాడుకుందాం రా...


రెండు నెలల ముందు...

ఆరు సంవత్సరాలు గా ఈ జాబు చేసి... చేసి.. చిరాకుగా ఉంది నాకు... ఎంత కాలం ఇలా అని కొంత కాలంగా అనిపిస్తూ ఉంది. మొదట్లో Software Engineer, తరువాత Software Consultant దాని తరువాత Sr.Software Consultant... Team Lead... ప్రాజెక్ట్ లీడ్... ఇలా పేరులు ఏమైనా చేసేది ఇంచుమించు ఒకటే కదా పని.... ఇంకా ఎన్ని రోజులు ఇలా...

ఇలాంటి సందర్భంలో... మా ప్రాజెక్ట్ మేనేజర్ నన్ను ప్రాజెక్ట్ లీడ్ చేసి, క్లైంట్ ప్లేస్ లో పని చెయ్యమన్నాడు. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్... తెలుసుగా మన గవర్నమెంట్ ఆఫీసు, ఆ స్టాఫ్.. గురించి...(గవర్నమెంట్ ఆఫీసు విషయాలు తరువాత ఎప్పుడైనా చేపుతలే...) అలంటి ప్రాజెక్ట్ నాకు అప్పగించి వాడేమో హైటెక్ సిటీ ఆఫీసులో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు... ఏమైనా క్లైంట్ తో ఇబ్బందులున్నాయి అని చెప్పినా వినడు, పట్టించుకోడు... ఏదో అలాగే పది నెలలు నేట్టుకోచా... నాలో జాబు మీద విరక్తి పెరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలో మార్చ్ వచ్చింది.. జీతం పెంచి, ప్రొమోషన్ వస్తుందనుకున్న నాకు పెద్ద షాక్... హైటెక్ సిటీ ఆఫీసులో రాజకియాలు నడిపారు... నేను సరిగ్గా పని చేయ్యలేదంట్ట, క్లైంట్ ప్లేస్ అని చెప్పి శేకార్లు కొట్టానంట... జీతం పెరగకపోయినా, ప్రొమోషన్ రాకపోయినా నేను బాధపడలేదు... కాని నేను... అంత కష్ట పడ్డ నేను పని ఏమి చెయ్యలేదు అని రిపోర్ట్ చూసినతరువాత కూడా అక్కడ పని చేయ్యలనిపించలేదు... వేంటనే రాజీనామా ఇచ్చీ బయటకి వచ్చేసా.

తరువాత నాకు టైం ఎక్కువ దొరకంతంతో చింటూ, రమేష్ లతోనే టైం స్పెండ్ చేసేవాడిని...

*********

ప్రస్తుతం...

చింటూ సొంతంగా ఒక ఎడిటింగ్ స్టూడియో ఉంది. చింటూ వాళ్ళ మేనమామగారు తెలుగు సినిమా నిర్మాత. ఆయననే ఆదర్శంగా తీసుకుని వాడు కూడా సొంతంగా ఏమైనా చేయాలనుకుతుండదు. రమేష్ నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్... వాడు కూడా జాబు కాకుండా ఏమైన చెయ్యాలనుకుంటూ ఉంటాడు. మేము ముగ్గురం శనివారంనాడు చింటూ వాళ్ళ ఇంట్లో కలుసుకున్నాము. ఏమి చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తున్నాము... ఇంతలో.. కిరణ్ (నా రూమ్మేట్.. ఫ్రెండ్ కుడా...) ఫోన్ చేసి హర్రీ పోట్టర్ 7 సినిమాకి టిక్కెట్లు తీసాను... ఆరున్నరకి ఐ-మాక్స్ లో షో అన్నాడు... నేను వాడిని మూడున్నరకి ప్రసాద్స్ కి రమ్మన్నాను.

*********

Time : 3.30 PM
స్థలము : ప్రసాద్స్

నలుగురము Mc Donaldలో కలుసుకోన్నాము. జాబు చెయ్యకుండా మా స్వశక్తితో డబ్బులు సంపాదించే మార్గాల గురించి చర్చ మదలైది. సినిమాలు తీదామా? సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేదామా? ఏమి చేయాలి???
సినిమాలు తీయాలంటే ముందుగా మన దగ్గిర డబ్బులు ఉండాలిగా... పోనీ అప్పో సప్పూ చీసి తీడమంటే... అది అంత తేలికయినది కాదుగా... ఏమిచేయాలో అల్లోచిస్తుంటే నాకు ఫోన్ వచ్చిది, ఇంటినుంచి... నేను అలా బయటకి వెళ్లి అమ్మతో మాటలడ్తుంటే అక్కడ జనం కనిపించరు నాకు... (అది ప్రసాద్స్ లో మామూలే... ఏదో కంపెనీ వాలు వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోషన్ కోసం ఏవో ఆటలో, పాటల పెడుతుంటారు...) వేంటనే ఒక ఐడియా (జీవితాని మార్చేసేదే... :)) వచ్చింది. దాంతో.. “అమ్మ నేను సినిమాకి వెళ్లి పదింటికల్లా ఇంటికి వస్తాను” అని చెప్పి ఫోన్ కట్ చేసి, మా వాళ్ళా దగ్గరకి వెళ్ళి “ఒరేయ్... నాకు మంచి ఐడియా వచ్చింది...” అని మోదలుపేటా...

“మనం రోజు టీవిలో ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాము కదరా..”... ఇంతలో రమేష్ గాడు... “నా రూములో టీవీ లేదురా!!!” అంటూ క్యూస్షన్ మార్క్ ఫస్ పెట్టాడు... “బాబు నన్ను చెప్పనీ రా...” అంటూ నేను వాడి నోట్లో బుర్గేర్ కుక్కేసాను...

“వాడి సంగతి తెలుసు కదా... వాడిని వదిలి విషయం చెప్పు” అన్నాడు చింటూ.

“సరే.. నరే..” అంటూ నేను మొదలపెట్టా... “టీవిలో రోజు ఆటకు, పాటలు అంటూ ఏవేవో ప్రోగ్రామ్స్ వస్తు ఉంటాయిగా... అలాగే, మనం కూడా ఒక్క గేమ్ షో స్టార్ట్ చేదాం... అది అందరికంటే బిన్నంగా ఉంటుంది” అని చెప్పి... గేమ్ షో, అది ఎలా ఉంటుంది... దానిని ఎలా ప్రెసెంట్ చెయ్యాలి... అన్ని చెప్పా...

“ఐడియా బాగానే ఉంది... దినిగురుంచి ఇంకా మనం రేసేఅర్చ్ చెయ్యాలి” అన్నాడు కిరణ్.... “దాని గురించి నువ్వు మరచిపో... చింటూ ఉన్నాడుగా” అన్నాను నేను... “ఆ.. దాని గురుంచి కావలిసిన సమాచారం నేను రేపు సాయంత్రం కాళ్ళ తెసుకోస్తా...” అన్నాడు చింటూ...

“ఒరేయ్ 6.20 అయ్యిందిరా.... సినిమా స్టార్ట్ అవుతాది ఇంకో పది నిమిషాల్లో...” అన్నాడు రమేష్. అందరం సినిమా హల్ల్లోకి వెళ్ళాం...”

ముడు గంటలు తరువాతా....
సరే మరి... రేపు సాయంత్రం నలుగు గంటలకి చింటూ వాళ్ళా ఆఫీసు లో కలుదాం అని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను.

ఇంటికి వచ్చి భిజనం చేసి... సరాసరి నా మంచంపై వాలిపోయాను... ఎప్పుడు పట్టిందో తెలీదు... గంగని చంద్రముఖి పట్టినటు... నాకు నిద్ర పట్టింది... (ఈ పోలిక ఎందుకు? అనుకుంటున్నారా... ఎందుకంటే మనకి రాత్రి ఒంటిగంట దాటాల్సిందే నిద్ర పూవాలంటే... అందుకు...)

*********



“ఒరేయ్ చింటూ... సెట్ట బాగుందిరా.. సూపర్.. థాంక్స్ ర బాబు.. ఎలా చేస్తామో ఏంటో అనుకున్నా... అన్ని బాగానే ఉన్నాయి... ఇంకో పావుగంటలో మన గేమ్ షో మొదలవుతుంది... నాకు చాల సంతోషంగా ఉందిరా...” అన్నాను.

“నువ్వు లేకపోతే ఇదంతా ఇంత తోదరిగా జరిగేది కాదురా.. ETVలో మన షో... నాకు చాల ఆనందంగా ఉంది... అలాగే భయంగా కూడా ఉందిరా...” అన్నాను చింటూ తో...

“భయమా.. ఎందుకు” అని అడిగాడు...

“ఈ షో కి నువ్వే డైరెక్టర్ అని నేను అంటే.. సరే అని,  ప్రేసేన్టర్ గా నన్నే చెయ్యమని అన్నావుగా... అందుకే... ఎలా ఉంటుందోనని చాల భయపడి చస్తున్నాను... చూడు... నా కాళ్ళు ఎలా వణికిపోతున్నయో...” అన్నాను...

“మరేమి పరవాలేదు... నిన్న మనం రిహార్సల్స్ చేసాము కదా.. నువ్వు బాగానే చేసావురా... భావపడకు... టైం అవుతుంది... వెళ్ళు.. స్టేజిపైకి... అల్ ది బెస్ట్...” అని వాడు నన్ను స్టేజిమీదకి తోసాడు.

“ఒకే... సైలెన్స్... లైట్స్ ఆఫ్... స్పోట్లిఘ్ట్ శ్రీను మీద పడాలి... కామెర రోలింగ్... శ్రీను... రెడీ... ఆక్షన్...” అన్నాడు చింటూ...

“'ఆటాడుకుందాం రా'కి స్వాగతం, సుస్వాగతం... ఇది మీరు ఎప్పుడు చూడని సరికొత్త గేమ్ షో... ఆట మొదలుపెడదామా... ”

*********

“ఇంకేంతసేపు పోడుకుంటావు.... లేరా పెద్దోడా... టైం పది అవుతుందిరా... డాడీ తో సంతకి వేల్లలిగా... లెగు...” అంటూ కేకలేసింది అమ్మ...

“నువ్వు నా గేమ్ షో కి ఎప్పుడు వచ్చావు అమ్మా...” అని నేను అన్నాను

“గేమ్ లేదు ఏమి లేదు.. ముందు లేచి సంతకి వెళ్ళు డాడీ తో...” అంది అమ్మ...

దెబ్బకి లేచి కుర్చున్న్...

ఏంటీ!!! ఇదంతా నా కలా...:(
 

No comments: